తొలి తెలుగు శాసనం ఎక్కడ?

« Prev
2/2 Next

'తెలుగు లిపి' నిర్మాణం...

తొలి తెలుగు శాసనం వల్ల నాటి నుంచి నేటి వరకు తెలుగు లిపి పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికి వీలు కల్గుతుంది. ప్రాకృత, ద్రావిడ భాషల నుండి విడిపోయి వేరుగా తెలుగు లిపి నిర్మితం కావడం గుర్తించవచ్చు. తెలుగు వాక్య రచనా విధానం, ఉచ్ఛారణ సౌలభ్యం కోసం చేసుకున్న ఇతర మార్పులు విశదమవుతాయి. ప్రాకృత వాక్యాల స్థానంలో తెలుగు వాక్యాలు చేరడం గమనించవచ్చు. వీటి ద్వారా తెలుగు భాషా సంప్రదాయ, స్వరూపాన్ని విశ్లేషించవచ్చు.

చరిత్ర ఆధారాల్లో...

రేనాటి చోళుల కారణంగా మనకు ఇవాళ ప్రాచీన తెలుగు వాక్య రచనా విధానం తెలుస్తోంది. రేగడినేల ఉన్న ప్రాంతం కాబట్టి 'రేగడినాడు' ప్రాంతం 'రేనాడు'గా మారి ఉండవచ్చునని చరిత్ర పరిశోధకుడు పుట్టపర్తి శ్రీనివాసాచారి అభిప్రాయపడ్డారు. రేనాటి చోళులు తాము కరికాల చోళుని సంతతికి చెందినవారమని చెప్పుకున్నారు. క్రీ.శ. 484 ప్రాంతంలో రేనాడు కరికాల చోళుని పాలనలో వుండేదని చరిత్రకారుడు నేలటూరి వెంకట రమణయ్య నిరూపించారు. తెలుగులో మొట్టమొదటి శాసనాల్లో కన్పించే రేనాటి చోళుని పేరు ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు. ఇతడు నందివర్మ కుమారుడు. ధనుంజయ వర్మ పేరుకు ముందున్న 'ఎరికల్' అనేది రేనాటి సీమలోని గ్రామమై వుంటుందని కూడా చరిత్రకారుల భావన. రేనాటి చోళులు 'చెప్పలియా' గ్రామం రాజధానిగా రేనాటి ప్రాంతాన్ని పాలించారు. రేనాడు ప్రాంతం కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, కమలాపురం, జమ్మల మడుగు, తాలూకాలు; కర్నూలు జిల్లా కోయిలకుంట్ల తాలూకాలోని కొన్ని ప్రాంతాలతో వున్న ఏడు వేల గ్రామాలున్న ప్రాంతంగా 'పూర్వోద్ధృతము' రచన నందు ఎస్.వి.రమణయ్య ఆధారాలు చూపారు. రేనాటి చోళులు తమ రాజధానిగా చేసుకున్న 'చెప్పలియా' ప్రాంతం నేడు కమలాపురం మండలంలోని 'పెద్ద చెప్పలి'గా తగిన ఆధారాలతో గుర్తించడం కూడా జరిగింది.

రేనాటి చోళుల వంశ వృక్షంలో 13 తరాల రాజుల పేర్లు శాసనాధారాల ద్వారా రూపొందించడమైంది. కశ్యప గోత్రానికి చెందిన నందివర్మ పరిపాలనా కాలం క్రీ.శ. 550 అని చెప్పుకోవచ్చు. తర్వాతి తరంలో వచ్చిన సింహ విష్ణు, సుందరనంద, ధనుంజయ వర్మలు క్రీ.శ. 575 ప్రాంతంలో వచ్చారు. పుణ్యకుమారుడు, వసంతపోరి చోళ మహరాణి భర్తగా, పోర్ముఖరామ, పురుష శార్దూల, మదన విలాస వంటి బిరుదులు ధరించి క్రీ.శ. 625లో నాల్గవ తరంలో కీర్తి పొందాడు. 11వ తరంలో నృపకామ (క్రీ.శ. 800), 12వ తరంలో దిహికర (క్రీ.శ. 825), 13వ తరంలో శ్రీకంఠ అధిరాజు (క్రీ.శ. 850) క్రమ పట్టికలో కన్పిస్తారు.

ఆనాటి కాలంలో యువరాజు కాకుండా మిగిలిన రాజకుమారులలో పెద్దవాడిని ముత్తురాజు అని పిలిచేవారు. అంటే యువరాజు తర్వాత రాజ్యానికి రాజుగా రావడానికి అవకాశాలున్న వారికే ఈ పట్టం యిచ్చేవారు. మహేంద్రవర్మ కొడుకైన పుణ్యకుమారుడి రెండు తామ్ర శాసనాలు, మూడు శిలాశాసనాలు లభిస్తున్నాయి. ప్రొద్దుటూరు రామేశ్వర శిలాశాసనంలో 'పృథివీ వల్లభ' అనే బిరుదు పేర్కొనడం జరిగింది. పుణ్య కుమారుడు హిరణ్య రాష్ట్రాన్ని పాలిస్తూ కొంత భూమిని దానం చేసినట్లు ఒక తామ్ర శాసనం చెప్తోంది. తర్వాత కాలంలో వైదుంబ రాజులు రేనాడును ఆక్రమించుకోగా వీరు పొత్తపి ప్రాంతానికి మరలిపోయినట్లు చరిత్ర కథనం. చివరగా...

గత ఏడాది డిసెంబర్ మాసంలో 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటూ నిర్వహించిన 'ప్రపంచ తెలుగు మహాసభల్లో' తొలి తెలుగు శాసనాన్ని ప్రదర్శిస్తారని ఎందరో భాషాభిమానులు, చరిత్ర పరిశోధకులు ఎదురుచూశారు. కానీ వారికి నిరాశే మిగిలింది. అధికార భాషా సంఘం, రాష్ట్ర సాంస్కృతిక శాఖ గానీ దీని పట్ల శ్రద్ధ పెట్టినట్లు కూడా కన్పించదు. భారతీయ పురాతత్వ శాఖ-హైదరాబాదు శాఖ గురించి యిక చెప్పనవసరం లేదు. కనీసం యికనైనా ఈ శాసనం ఆనవాళ్ళ గురించి, ఆచూకీ గురించి విస్తృతంగా అన్వేషణ జరగాల్సిన అవసరం తప్పనిసరిగా వుంది. లేదంటే- చరిత్ర ఎప్పటికీ మనల్ని క్షమించదు.

కలమళ్ళ శిలాశాసనము

దాత : తెలుగు చోళవంశపు ధనంజయుడు

పరిపాలన కాలము: క్రీ.శ. ఆరవ శతాబ్ది అంతము

శాసన కాలము : అనిర్దష్టము ......................... శాసనభాగ పాఠము  : 1. ...................  2. కల్ముతురా 3. జు ధనంజ 4. య ఱు రేనా 5. ణ్డు ఏళన్ 6. చిఱుంబూరి 7. రేవణకాలు (పం) 8. పు చెనూరు కాజు 9. ఆఱికాశా ఊరి 10. ణ్డవారు ఊరి 11. న వారు ఊరిస...

- డాక్టర్ వేంపల్లి గంగాధర్ మరియు తెలుగు సొసైటి.బ్లాగ్స్పాట్ వారి సౌజన్యంతో

« Prev
2/2 Next
Read 4134 times
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

  Stay Connected with TAGKC

Galleries

Dear TAGKC Member   We would like to invite you and your family to Ugadi (శ్రీ...
Executive Committee Honarary Advisors Trust Boardకార్యవర్గం గౌరవ...
From TELUGU ASSOCIATION OF GREATER KANSAS CITY  
 'భోగి' భోగభాగ్యాలతో సంక్రాంతి'...

Who's Online

We have 33 guests and no members online

Get connected with Us

Subscribe to our newsletter

POPULAR TOPICS

 • ఇట్లు మీ విధేయుడు ..భమిడిపాటి రామగోపాలం
  భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు.
  Read more...
 • అల్లూరి సీతారామరాజు చరిత్ర
  భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య…
  Read more...
 • గబ్బిలము- గుర్రం జాషువా
  గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి ,…
  Read more...
 • మొల్ల రామాయణం
  “కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ…
  Read more...
 • బారిష్టర్ పార్వతీశం
  మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు…
  Read more...