ఈ సువర్ణాక్షరాలు కన్నడ రాజ్యరమారమణుడైన శ్రీకృష్ణదేవరాయలే స్వయంగా తన ఆముక్తమాల్యద ప్రబంధంలో చెప్పిన పద్యమిది. దేశభాషలన్నింటిలోనూ తెలుగుకున్న ప్రత్యేక ఘనత ప్రకాశితమైనది. దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సింహాసనం అధిరోహించి 500 సంత్సరాలు పూర్తయ్యాయి.
తెలుగు భాషకు, జాతికీ గౌరవాన్ని తీసుకొచ్చిన శ్రీకృష్ణదేవరాయలు ప్రాతఃస్మ రణీయుడు. విజయనగర సామ్రాజ్య వైభవం అనంతపురం జిల్లాలో కూడా విస్తరించి ఉంది. అందుకే ఆ మహనీయుడిని తలుచుకుంటూ ఉత్సవ కార్యక్ర మాన్ని నిర్వహించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈనెల 27 నుం చి 29వరకూ కర్నాటక ప్రభుత్వం కూడా హంపి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. నేటి చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గరలోని దేవకీపురంలో నాగ లాంబ, నరసనాయక దంపతులకు 1471 జనవరిలో శ్రీకృష్ణదేవరాయలు జన్మించి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. నాడు శ్రీరంగపట్టణ గవర్నరుగా ఉన్న వీరప్పగౌడ కుమార్తె తిరుమలదేవితో 1498లో వివాహం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు నాగలాదేవిని వివాహమాడి ఆమె పేరును చిన్నాదేవి గా మార్చాడు. ఆ తర్వాత 1510లో శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఆయన పట్టాభిషేక మహోత్సవానికి ఇప్పటికి 503 సంవ త్సరాలైయ్యాయి.
కళాపోషకులు...
కవులను కళాకారులను ఆదరించడం కృష్ణదేవరాయల నిత్య కృత్యం. విజయ నగర రాజుల మొదటి రాజధాని హంపి. ఆ తర్వాత శ్రీకృష్ణదేవ రాయల కాలం లో అంతర్గత కలహాల అనంతరం తన ప్రధాన పరిపాలనా కేం ద్రం పెనుకొండ అయ్యింది. ఆనాడు పెనుకొండలో విడిది కేంద్రంగా శతృదుర్బేధ్యంగా ఒక కోట నిర్మించుకున్నారు. ఆ కోటలోనే మందుగుండు సామగ్రి, ఫిరంగులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన మంత్రి, గురువు అయిన అప్పాజీని ఖైదు చేసింది కూడా ఇక్కడే. అప్పాజీ మరణానంత రం ఇక్కడే ఆయన సమాధికూడా ఇక్కడే వుంది.అప్పాజీ మరణానంతరం శ్రీకృష్ణ దేవరాయలు కుంగిపోయి రాజ్యభారాన్ని నాడు చంద్రగిరిని పాలిస్తోన్న తన సోదరుడైన అచ్యు తరాయలుకు కట్టబెట్టాడు. తదనంతరం 1542లో అధికారం రామరా యలు చేతికి వచ్చింది.
శ్రీకృష్ణదేవరాయల పాలనలో హంపి వైభవాన్ని కవులు కళ్లకు కట్టినట్లు తెలిపా రు. 1565లో తళ్లికోట యుద్ధం జరిగింది. ఆ యుద్ధం శ్రీకృష్ణదేవరాయల అల్లుడు రామరాయలకూ, బహమనీ సుల్తానుల మధ్య ఘోర యుద్ధం జరిగిం ది. ఆయుద్ధంలో బహమనీ సుల్తానుల దాడికి ఆగలేక రామరాయలు పట్టుపడ్డాడు. తదనంతరం బహమనీ సుల్తానులు రామరాయల తల నరి కి విజయనగర సామ్రాజ్యాన్ని వశం చేసుకున్నారు. ఒకనాడు హంపి వీధుల్లో వజ్రాలు, రత్నాలను రాసులుపోసి అమ్మేవారని చరిత్రకారుల వలన తెలుస్తోంది. అలాంటి ఉన్నతమైన విజయనగర సామ్రాజ్యం తళ్లికోట యుద్ధంతో పతనమైం ది. ఒక అద్వితీయ ప్రతిభావంతుడు, సాహిత్య సమరాంగణ సార్వభౌముడు, కళాపోషకుడు, కళారాధకుడు, సంస్కృతాంధ్ర కన్నడభాషల్లో కవి అయిన శ్రీకృష్ణదేవరాయలను స్మరించు కుంటూ అటు కర్నాటక రాష్ట్రంలో నూ, ఇటు మన ఆంధ్రప్రదేశ్లోనూ ఉత్సవాలను నిర్వహించారు.
హంపి...
ఆనాటి విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఈ నగర వీధుల్లో వజ్రాలు, రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారట! రాజులుపోయారు... రాజ్యాలూపోయా యి... నేడు ఆ అద్భుతమైన హంపి నగరం చారిత్రక కథలు చెప్పే శిధిల నగరం. తరువాత కాలగర్భంలో కలిసిపో యింది. పురాతత్వవేత్తలు తరువాత కాలంలో తవ్వకాల్లో అనేక కట్టడాలూ, దేవాలయాలూ బయల్పడ్డా యి. ఆ హంపి పరిసర ప్రాంతాల్లో తుంగభద్రా నది ప్రవహి స్తుండటంతో ప్రకృతి అందాలు రమణీయతను విరజిమ్ముతాయి. పచ్చని చెట్లు, పొలాల మధ్య వెలసిన హంపి క్షేత్ర దర్శనం మహా భాగ్యమని పర్యాటకుల అభిప్రాయం.
కొనియాడుతూనే ఉన్నారు...
హంపిలో వెలిసిన శివుని పేరు విరూపాక్షేశ్వరుడు. ఇక్కడ హంపిలో విరూపాక్ష దేవాలయం, రాతిర థం, ఉగ్ర నరసింహ, శివలింగ, గణేశ విగ్రహాలు, రాణి స్నానగృహం, కమలమహాల్, గజశాల, హజ రారామదేవాలయం, అనెగుంది కోట, మాతంగ పర్వతం, కోదండరామ ఆలయం, యంత్రోద్ధారక హనుమంతుడు, హేమకూటము, కడ్లెకాళు గణప తి, శ్రీకృష్ణ దేవాలయం, బడవలింగ ఆలయం, వీర భద్ర దేవాలయం, అక్కాచెల్లెళ్ల రాయి, పాతాళే శ్వర ఆలయం, దండనాయకుని కోట, మహానవమి దిబ్బ, నల్లరాతి కళ్యాణి, కమలాపురంలో ప్రాచ్య వస్తు సంగ్రహాల యం, మల్లప్పగుడి, అనంత శయ న గుడి, పర్యా టకులను విశేషంగా ఆకట్టుకుంటు న్నాయి. హంపి గత వైభవాన్ని పర్యాటకులు, రచ యితలు తమ రచనల్లో నాటి నుంచి నేటి వరకూ కొనియాడుతూనే ఉన్నారు.
హంపి శిల్పకళా సౌంద ర్యం జీవితంలో ఎన్నడూ చూడలేనిదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది రోమ్ నగర మంత విశాలమైనదని, ప్ర పంచంలో అద్భుతమైన సదుపాయాలు కలిగి ఉన్న నగరంగా హంపిని విదేశీ పర్యాటకులు కూడా వర్ణించారు. హంపి ప్రాముఖ్యత చాటి చెప్పేందుకు ఆలస్యంగానైనా గుర్తించిన ప్రభుత్వం 1987లో మొదటిసా రిగా హంపి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఏటా హంపి ఉత్స వాల ను తిలకించేందుకు లక్షలాదిమంది ప్రజలు, పర్యాటకులు హంపికి చేరుకుంటా రు. అక్కడ పగటిపూటను తలపించే విధంగా రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు దేదీ ప్యమానంగా వెలుగుతుంటాయి. ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ప్రజలు మంత్రముగ్ధులై తిలకి స్తూ పండుగ వాతావరణంలో గడపడం విశేషం.
-దామర్ల విజయలక్ష్మి, తెలుగు సాహిత్యం సౌజన్యం తో