తొలి శతకం

తెలుగులో తొలి శతకమేది? అనే ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టమే. కొందరు మల్లికార్జున పండితారాధ్యుడనే శివ కవి రాసిన ‘శివతత్త్వసారము’ తొలి శతకమన్నారు. అజా, రుద్రా, శివా అనే మకుటాలతో 489 పద్యాలుగల రచన ఇది.

‘‘శతకమనుపేరు లేకున్నను శివతత్త్వసారమునందలి పద్యములు సర్వ విధముల శతకములనే పోలియున్నవి’’ అని అంచనావేసారు ఆచార్య జి.నాగయ్య. కానీ నిడదవోలు వెంకటరావు ‘‘తెలుగున తొలి శతకము మల్లికార్జున పండితారాధ్యుని శ్రీగిరి మల్లికార్జున శతకము. దీని మకుటము శ్రీగిరి మల్లికార్జున’’ అని వెల్లడించారు. అయితే శ్రీగిరి శతకంలో కొన్ని పద్యాలు తప్ప శతకం లభ్యం కాలేదు. అదే నిడదవోలు వృషాధిప శతక పీఠిక రాస్తూ ‘‘ఆంధ్ర శతక వాజ్ఞ్మయమున సంఖ్యానియమము, మకుట నియమము గలిగిన శతకములలో ప్రధమము వృషాధిప శతకము’’ అన్నారు. అందువల్ల శతక లక్షణాలు సంపూర్ణంగా కలిగి, లభ్యమైన వృషాధిప శతకమే తెలుగులో తొలి శతకంగా పేర్కొనబడుతోంది.
పనె్నండవ శతాబ్దికి చెందిన పాల్కురికి సోమనది తెలంగాణలో ‘పాలకుర్తి’గా చెప్పబడుతోంది. ఇతను వీరశైవాన్ని ఆచరించిన వాడు. ‘శివకులీనుడు’ అని చెప్పుకున్నాడు. మూర్త్భీవించిన శివభక్తి స్వరూపమే పాల్కురికి సోమన. ‘‘తెలుగు మాటనంగ వలదు, వేదముల కొలదియగా’’ చూడుడని తెలుగు అభిమానాన్ని అప్పుడు చాటి చెప్పిన తొలి కవి. వృషాధిప శతకం బసవని స్తుతిరూపకమైన శతకం. వీర శైవ మత స్థాపకుడైన బసవుడంటే సోమనకి సాక్షాత్తు శివుడే.
‘‘నా యొడయుండ, నా విభుడ, నా హృదయేశ్వర, నా మనోరమా
 నా యిలవేల్ప, నా వరద, నా గురులింగమ, నాదు జంగమా
 నాయధినాథ, నావరుడ, నన్ను కృపామతి బ్రోవుమయ్య దే
 వా. యమ బృంద వంద్య బసవా బసవా బసవా వృషాధిపా!’’
ఈ వృషాధిప శతకంలో అనుప్రాస గల పద్యాలున్నాయి. ఏక సమాసంతో కూడిన పద్యాలున్నాయి. నమస్కారాంత (నమో నమో అంటూ) పద్యాలూ వున్నాయి. సంస్కృతం, తమిళం, కన్నడం, ఆరె భాషలలో పద్యాలు రాసాడు. మణిప్రవాళ శైలిలో (సంస్కృతాంధ్ర పదాలను కలుపుతూ) రాసిన తొలి కవి కూడా సోమనే. బసవుని మహిమల్నే కాకుండా సామాన్యులైన శివభక్తుల చరిత్రను కూడా వివరించాడు. చంపక, ఉత్పలమాల పద్యాలతో రాయబడిన వృషాధిప శతకం భక్తి శతకాలలో అగ్రస్థానంలో నిలుస్తుంది.

- ద్వా.నా.శాస్త్రి
http://archives.andhrabhoomi.net/sahiti/toli-188

 

Read 3069 times
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

  Stay Connected with TAGKC

Galleries

From TELUGU ASSOCIATION OF GREATER KANSAS CITY  
   Welcome to TAGKC Dasara Deepavali Celebrations - 2017 !! దసరా...
Welcome to TAGKC Dasara & Diwali Celebrations 2017 !! Enroll to Participate...
 శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది...

Who's Online

We have 52 guests and no members online

Get connected with Us

Subscribe to our newsletter

POPULAR TOPICS

 • ఇట్లు మీ విధేయుడు ..భమిడిపాటి రామగోపాలం
  భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు.
  Read more...
 • అల్లూరి సీతారామరాజు చరిత్ర
  భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య…
  Read more...
 • గబ్బిలము- గుర్రం జాషువా
  గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి ,…
  Read more...
 • మొల్ల రామాయణం
  “కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ…
  Read more...
 • బారిష్టర్ పార్వతీశం
  మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు…
  Read more...