తొలి సంకలన గ్రంథం

ఇది శ్రీ నరసింహ వర ప్రసాద లబ్ద విచిత్ర కవిత్వము కలవాడును. భారద్వాజ గోత్ర పవిత్రుడును, అయ్యలామాత్యుని పుత్రుడును, సరస గుణధర్యుడును అగు సింగనార్యుడు రచించిన సకల నీతి సమ్మతమును రాజనీతి శాస్తమ్రు’’ అంటూ మడికి సింగన రాసిన ‘‘సకల నీతి సమ్మతము’’ తెలుగులో తొలి సంకలన గ్రంథం.

మడికి సింగన శ్రీనాథ యుగము నాటివాడు. కొందరు క్రీ.శ. 1347 ప్రాంతము వాడని, కొందరు క్రీ.శ. 1420 ప్రాంతమునాటి వాడని అభిప్రాయపడ్డారు. ఇతను పద్మ పురాణోత్తర ఖండము, భాగతవము దశమ స్కంధ ద్విపద, జ్ఞానవాసిష్ట రామాయణము అనే వాటిని కూడా రచించాడు.

వివిధ గ్రంథాలనుంచి సేకరించి ఒక సంకలనంగా తీసుకువచ్చి నేటి సంకలన గ్రంథాలకు ఆద్యుడయ్యాడు మడికి సింగన. కామందకము, పంచతంత్రము, నీతి సారము, బద్దెన నీతి శాస్త్ర ముక్తావళి, పురుషార్థసారము, నీతి భూషణము, భారతముల నుంచి స్వీకరించిన పద్యాలతో ఈ సంకలనం చేశాడు. సకల నీతి సమ్మతం- అనే పేరున్నా గానీ ఎక్కువుగా ఆకాలపు రాజనీతి సూత్రాలే ఎక్కువుగా ఉన్నాయి. పూర్వకాలంలో రాజనీతిని గ్రహించటానికి - ఈ కాలానికి కొన్నిటిని అన్వయించుకోవటానికి ఈ గ్రంథం ఉపకరిస్తుంది. ఈ పద్య సంకలన గ్రంథాన్ని మొట్టమొదటగా మానవల్లి రామకృష్ణ కవిగారు వెలుగులోకి తెచ్చారనీ, 1923లో తొలుత శ్రీ కాశీనాథుని నాగేశ్వరావు పంతులుగారు తమ ఆంధ్ర పత్రికా ముద్రణాలయంలో ప్రచురించారనీ- ఈ పద్య సంకలనం గ్రంథాన్ని వచనంలోకి అనువదించిన బులుసు వెంకట రమణయ్య గారు పేర్కొన్నారు.

మూడాశ్వాసాలుగల ‘సకల నీతి సమ్మతము’’లో దుర్గ సంరక్షణము, ప్రజాపాలనము, ఆదాయ వ్యయ ప్రకారము, రాజనీతి, రాజునకు కొరగాని గుణములు కరణికపునీతులు, వైద్యనీతి, రాయబార ప్రకారము, చారుల నీతులు, రాజ భృత్య నీతులు, సేవింపదగని రాజులు, చతురుపాయాలు, వ్యసనములు, దండయాత్ర, చోర నీతులు, ప్రయాణ వ్యసన పరీక్ష మొదలైన అంశాలున్నాయి. సామాన్య నీతులూ వున్నాయి. కొన్ని నీతి వ్యాక్యాలను గమనించండి.

‘‘రాజుగారి మన్ననయున్న యెడల మేకవంటి సాధువైన పురుషుడైనను సింహము వంటి వాడగును. ఆ మన్నన లేని యెడల సింహము వంటి వాడైనను మేకవలె అగును’’

 ‘‘ప్రజాపాలన చేయ కథనము కోరు రాజు ధాన్యపు కుప్పకు నిప్పు అంటించి పేలాలు తినదలచినవాని వంటివాడు’’

 ‘‘బంగారమును కాల్చినను, ముక్కలుచేసినను కూడా గుణము మార్పు చెందదు. అట్లే కష్టకాలమునందు మిక్కిలి తాపము కలిగినను. గట్టి దెబ్బలు తినిననుసరే వికారమును పొందరాదు’’

 ‘‘నమ్మించి మోసపుచ్చి దేవతలనైనను జయింపవచ్చును. ఇతరుల సంగతి యిక చెప్పనేల?’’

ద్వా.నా.శాస్త్రి

http://archives.andhrabhoomi.net/sahiti/toli-396

 

Read 3650 times
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

  Stay Connected with TAGKC

Galleries

 
 ఉగాది పండుగ...
    Dear TAGKC Member,     TAGKC would like to invite our members and others in...
 Wishing you and your family a great Happy Republic Day !! మీకు మీ...

Who's Online

We have 60 guests and no members online

Get connected with Us

Subscribe to our newsletter

POPULAR TOPICS

  • ఇట్లు మీ విధేయుడు ..భమిడిపాటి రామగోపాలం
    భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు.
    Read more...
  • అల్లూరి సీతారామరాజు చరిత్ర
    భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య…
    Read more...
  • గబ్బిలము- గుర్రం జాషువా
    గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి ,…
    Read more...
  • మొల్ల రామాయణం
    “కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ…
    Read more...
  • బారిష్టర్ పార్వతీశం
    మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు…
    Read more...