సంక్రాంతి సంస్కృతిలో సాహిత్య పర్వం

Prev
1/3 Next »

ఏ జాతికైనా సంస్కృతిని ప్రతిబింబించేవి పండుగలే. అలాంటి పండుగల్లో 'సంక్రాంతి' ని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. సంక్రాంతి పుష్యమాసంలో వచ్చే పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. ఆ రోజునుంచి ఉత్తరాయణం ప్రారంభమౌతుంది. అంటే సూర్యుని ప్రయాణం ఉత్తరదిశగా సాగుతుంది.

తమిళ, కన్నడ, మరాఠీ ప్రజలు కూడా ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఆంగ్ల సంవత్సరం ప్రకారం వచ్చే మొదటి పెద్దపండుగ ఇది. ఇది పంటల పండుగ. పంటరైతు ఇంటికి చేరి ప్రతి ఇల్లు ధాన్యలక్ష్మితో కళకళలాడే సమయం ఇది.

ఈ ఉత్తరాయణ కాలం పుణ్యకాలమని ప్రజల విశ్వాసం. పంచాంగాల వివరణలో 'సమ్యక్‌ క్రాంతి' అని కురు సంక్రాంతిని నిర్వచిస్తారు. క్రాంతి అంటే మార్పు. ఈ పండుగ ప్రతి సంవత్సరం జనవరి 13,14,15 తేదీలలో వస్తూంటుంది. సంక్రాంతి మూడు రోజుల పండుగ. మొదటిరోజు భోగి, రెండవ రోజున సంక్రాంతి, మూడవ రోజున కనుమ పండుగ. ఈ మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎంతో వైభవం సంతరించుకుంటుంది. విలాసాలకి వినోదాలకి ఈ పండుగ చాలా ప్రసిద్ధి. అటువంటి వినోదాలలో 'కోడిపందేలు' ఒకటి. ఉభయగోదావరి జిల్లాల్లో ఈ కోడిపందేల జోరు చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో ఎండ్ల పందేలు కూడా జరుగుతాయి. ఈ పోటీల్లో అక్కడక్కాడ కక్షలూ, కార్పణ్యాలు కూడా బహిర్గతం అవుతూ ఉంటాయి.

సంక్రాంతి శోభలో మరో అంశం హరిదాసు కీర్తనలు. సంవత్సరంలో ఒక్క ధనుర్మాసంలోనే ఈ హరి దాసులు కనిపిస్తారు. ధనుర్మాసం నెల రోజులు వీరు హరినామ కీర్తనతో పల్లెలోని ప్రతి ఇంటిని పావనం చేస్తారు.

సంక్రాంతి శోభలో మరో వేడుక 'గంగిరెద్దుల ఆట' ఎద్దులను సాక్షాత్తు నంది కేశ్వరుని రూపంగా భావించి, అలంకరించి ఆడిస్తారు. ఈ పండుగలో చిన్నపిల్లల నుండి పెద్దలదాకా ఆకాశంలోకి గాలిపటాలను వదిలి అవి ఆకాశంలో ఎగురుతూ హొయలు ఒలికిస్తుంటే ఎంతో ఆనందపడతారు.

సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టుకునే ఆచారం ఉంది. భోగినాడు చిన్న పిల్లలకు భోగిపళ్లు పోస్తారు. గడప గడపలో ముత్యాల రంగవల్లులు తీర్చిదిద్దే ఆడపడుచుల ఆనందం అంతా ఇంతా కాదు. ముత్యాల ముగ్గులు, ఆ ముగ్గుల మధ్య గొబ్బిళ్లు వాటి మీద పచ్చని గుమ్మడి పూలు. ముంగిళ్లకే కొత్త అందాలు తెస్తాయి. కొత్త బియ్యం, కొత్త బెల్లం వచ్చే తరుణంలో ఇంటింటా బోలెడన్ని పిండివంటలు ప్రతి ఇల్లూ ఆడపడుచులూ, అల్లుళ్లు, బంధువుల సందళ్లతో ఆనందాలు వెల్లి విరుస్తాయి.

Prev
1/3 Next »
Read 6228 times
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

  Stay Connected with TAGKC

Galleries

Dear TAGKC Member   We would like to invite you and your family to Ugadi (శ్రీ...
Executive Committee Honarary Advisors Trust Boardకార్యవర్గం గౌరవ...
From TELUGU ASSOCIATION OF GREATER KANSAS CITY  
 'భోగి' భోగభాగ్యాలతో సంక్రాంతి'...

Who's Online

We have 16 guests and no members online

Get connected with Us

Subscribe to our newsletter

POPULAR TOPICS

  • ఇట్లు మీ విధేయుడు ..భమిడిపాటి రామగోపాలం
    భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు.
    Read more...
  • అల్లూరి సీతారామరాజు చరిత్ర
    భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య…
    Read more...
  • గబ్బిలము- గుర్రం జాషువా
    గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి ,…
    Read more...
  • మొల్ల రామాయణం
    “కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ…
    Read more...
  • బారిష్టర్ పార్వతీశం
    మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు…
    Read more...