స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద Featured

ప్రపంచంలో అతి ప్రాచీన సంస్కృతి భారతీయ సంస్కృతి. యుగ యుగాల హిందూ విజ్ఞాన సంకలనమే ఈ మహోన్నత సంస్కృతి. అనాదిగా ఎన్నో అవాంత రాలను తట్టుకుని ఉత్కృష్టమైన స్థానాన్ని పొంది నూతన తేజస్సుతో ప్రపంచ నలుమూలలా తనకీర్తి పతాకాన్ని రెపరెప లాడించిన మహా సంస్కృతియే భారతీయ సంస్కృతి.

ఇలాంటి భారతీయ సంస్కృతిని, దేశభక్తిని, జాతీయ భావాన్ని ప్రతి ఎదలో ప్రతిధ్వనించేటట్లుగా, ప్రతినిత్యం స్మరించేటట్లుగా ప్రచారం చేసి యావత్‌ జాతినంతా మేల్కొలిపిన మహనీయుడు స్వామి వివేకానందుడు.


ప్రపంచానికి భారతదేశపు గొప్పదనాన్ని, విశిష్టతను, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన సంస్కృతీ పరి రక్షకుడు స్వామివివేకానంద. ప్రపంచంలోని అన్ని మతాల కన్నా హిందూమతం, హిందూ వేదాంతం గొప్పదని ప్రపంచానికి చాటిన గొప్ప వేదాంతి స్వామి వివేకానంద. భారతీయు డిగా జన్మించి నందుకు గర్వించాలని, పాశ్చాత్య అనుక రణ నాగరికత అనుపించుకోదని పదే పదే హెచ్చరిం చిన స్వాభిమాని స్వామి వివేకానంద. అయితే ప్రపంచం లో ఎవరూ మతం మార్చుకోనక్కరలేదనీ, క్రైస్తవుడు క్రైస్తవుడిగానే, ముస్లిం ముస్లింగానే ఉండి పరమపదాన్ని చేరుకోవాలన్నాడు. ఏ మతమైనా మానవునికి మోక్షం చూపించేదేనని భావించే మత సహనయోగి స్వామి వివేకానందుడు.


అమెరికాలోని చికాగో నగరంలో సర్వ మత సమ్మేళనంలో పాల్గొని భారతీయ వేదాంతం యుక్క గొప్పతనాన్ని, భార తీయ సంస్కృతిని పాశ్చాత్య దేశస్తు లకు తెలిసేే విధంగా ప్రసంగించి అఖండ గౌరవాన్ని పొందిన ఆధ్యాత్మిక జ్యోతి స్వామి వివేకా నంద. దీనివల్ల భారతదేశ గొప్పతనం విదేశీ యులకు అవగత మయింది.


స్వామి వివేకానందుడు తరచూ సర్వ వేదాం తానికి మూలం హిందూ మత మని, హిందూ మతంలోనే జీవ మున్న దని, సంస్కృతీ ఉన్నదని, మానవ సేవయే మాధవసేవ అని బోధిస్తూ భారతీయులను జాగృతం చేశాడు. ఎప్పుడైతే భారతదేశం నశిస్తుందో అప్పుడే ప్రపంచంలోని ఆధ్యాత్మిక తత్వం నశిస్తుందని హెచ్చరించిన భవిష్యత్‌ ద్రష్ట.


భారతదేశంలో బ్రహ్మసమాజం, ఆర్యసమాజం, రామకృష్ణ మిషన్‌ వల్ల హిందూ మతం నిలదొక్కుకున్నప్పటికీ ఆంగ్లేయుల రాక వల్ల దేశంలో పాశ్చాత్య నాగరికత ప్రభలి హిందూ సంస్కృతిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దాని ఫలితంగా దేశంలో గల వేషభాలపై, జీవన విధానాలపై మార్పు చూపింది. అయినప్పటికీ ప్రాచీన హిందూ సంస్కృతి తన మూలాల్ని చెక్కుచెదరనీయలేదు.


మారుతున్న కాలానుగుణంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నూతన పోకడలు, నూతన సంప్రదాయాలు, నూతన పద్ధతులు జనం అలవరచుకుని సంస్కృతి అభివృద్ధికి కారకులవుతున్నారు. ఉదాహరణకు గాంధీజీ తన జీవన విధానం ద్వారా భారతీయ సంస్కృతిని కాపాడిన విశిష్ట వ్యక్తి. ఖద్దరు


బట్టలు ధరించడం, టోపిని పెట్టుకోవడం వంటి నూతన పద్ధతులను అవలంభించి భారతీయ సంస్కృతిని కాపాడిన మహాత్ముడు గాంధీజీ.


ఏ సంస్కృతిలోనైనా ఆ జాతికి వారస త్వంగా లభించే ఆచార వ్యవ హారాలు, మత సంప్ర దాయాలు, ఆహార నియ మాలు, కర్మ కాండలు మొదలైన అంశాలు సంస్కృ తికి జీవనాడిగా పేర్కొన బడ తాయి. ఇవన్నీ భారతీయ సంస్కృతి లో నేటికీ ఆచారంగా ఉన్నాయి.


స్వామి వివేకానంద భారతీయ సనాతన ధర్మానికి చెందిన కర్మ సిద్ధాం తాన్ని విశ్వమానవ సౌభ్రాతృ త్వాన్ని ప్రచారం చేశాడు. వేదాంతం నుంచి స్ఫూర్తి పొందాలని యువతను ప్రేరేపిం చాడు.


వివేకానంద బోధ ఒక్కటే. సర్వమతాల సారమొక్కటెెనని 'మతాలనేవి నదుల వంటివి. చివరికి అవి మోక్షమనే సముద్రం లో కలుస్తాయి' అని శాశ్వత సత్యాన్ని బహర్గిత పరిచిన స్వామి వివేకా నంద వేదాంతయోగి. భారతీయ సంస్కృతికి మూలాధారమైన 'భిన్న త్వంలో ఏకత్వం' ను సాధించ డానికి విశేష కృషి సలిపిన వివేకానంద భారతీయ సంస్కృతిని కాపాడిన 20వ శతాబ్దపు విశిష్ట వ్యక్తి.


'భారతదేశాన్ని నమ్ముకోండి, భారతీయ విలువల పట్ల విశ్వాసం ఉంచండి, శక్తివంతులు కండి, విశ్వాసంతో జీవిం చండి, సంస్కృతిని కాపాడండి అంటూ స్వామి వివేకానంద యావత్‌ హిందూవులను జాగృతం చేసి ప్రపంచ మానవాళికి సహనం, త్యాగం, ధర్మం, దేశ భక్తులను ప్రభోదించిన మహాప్రవక్త.


భారతీయ సంస్కృతిని, నాగరికత, వారసత్వ సంపదలను దేశ ఔన్న త్యాన్ని గొప్పదనాన్ని దశదిశల చాటిచెప్పిన వివేకానందుని గూర్చి పలువురు ప్రశంసిస్తూ 'భారతదేశంలో జన్మించిన కారణజన్ముడిగా ప్రస్తుతించారు.


''నరేంద్రుడు ప్రపంచపు పునాదులను కదిలించి వేయును'' అని శ్రీరామకృష్ణుడన్న మాటను స్వామి వికానంద అక్షరాల నిజం చేశాడు. ''వివేకానందుని రచనలను నేను క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఆయన రచనలను మననం చేసుకున్న ఫలితంగా నా దేశం మీద నాకు గల ప్రేమ వేయి రెట్లు పెరి గింది'' అని గాంధీ మహాత్ముడు స్వామి వివేకానందుని


గొప్పతనాన్ని కీర్తించాడు. ''భారతదేశం గురించి తెలుసు కోవాలంటే వివేకానందుని అధ్యయనం చెయ్యండి'' అని విశ్వకవి రవీంధ్రనాథ్‌ టాగూర్‌ అభివర్ణించాడు. ''వివేకా నందుడు నేడు ఉన్నట్లయితే నేనాయన పాదసన్నిధిలో ఉండెడి వాడను. నేను అతిశయమేమి చెప్పకపోతే ఆధునిక భారతదేశం ఆయన సృష్టి. నా జీవితం వివేకానందుని ప్రభావంతో రూపొం దింనది. యువకులు స్వామిజీని ఆదర్శం గా తీసుకుని ముందుకు నడవాలి'' అని నిష్కళంక దేశభక్తుడు నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నాడు. ''స్వామి వివేకానందుడు భారతజాతీయతకు తండ్రి వంటివాడు. ఆధునిక భారతపితయగు ఇతనిని జూచి ప్రతి భారతీ యుడు గర్విస్తాడు'' అని లోకమాన్యతిలక్‌ ప్రశంసించారు.


జాతీయోద్యమంలో కార్మికులనూ, కర్షకులనూ భాగస్వాములుగా చేసిన దేశబంధు చిత్తరంజన్‌ దాస్‌ వివేకానందుడే నా గురువు'' అని గొప్పగా చెప్పుకున్నాడు. స్వదేశి ఉద్యమకాలంలో ఉద్రేకంతో ప్రసంగాలు చేసినబ బిపిన్‌ చంద్రపాల్‌ ''ఆధునిక భారతదేశజాతీ


యకు వివేకానందుడు అతిగొప్ప ప్రచారకుడు మరియు ప్రవక్త. జాతీయోద్యమ వ్యాప్తికి అత్యవసరమైన జ్వలించే దేశ భక్తిని జనులలో రగుల్కోల్పిన గొప్ప మహనీయుడు స్వామి వివేకా నందుడు'' అని ప్రశంసించాడు. రామకృష్ణుడు మానవరూపమెత్తిన దేవుడు.


వివేకా నందుడు అతని ప్రవక్త. భవిష్యత్‌ భారతదేశానికి ప్రతినిధిగా వివేకా నందుణ్ణి రామకృష్ణుడు తీర్చిదిద్దాడు.


తన యావత్‌ శక్తిని ఈ నాయకునిలో ప్రవేశింపజేశాడు. ఆ శక్తియే ఇప్పుడు మధ్యాహ్న మార్తాండుని తీక్షణకిరణములవలె యావత్తు దేశం మీద ప్రసార మవుతున్నది. ''వివేకానందుడు మరణించలేదు. అతని ఆత్మ భరత మాత బిడ్డల ఆత్మలలో జీవిస్తున్నవి''. అని స్వామి వివేకా నందుని బోధనను విని ప్రభావితుడైన అరవిందఘోష పేర్కొన్నారు.


స్వామి వివేకానంద ఆత్మను, తత్త్వాన్ని అవగాహన చేసుకున్న మహాత్ముల అభిప్రాయాలవి. ఎవరు ఎన్ని ర కాలుగా చెప్పినా భార తీయ ఆత్మను విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుడు నేటి యువత రానికి స్ఫూర్తి. యావత్‌ భారతజాతికి ఆశాజ్యోతి.


డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌

 http://www.prabhanews.com/tradition/article-418834

Read 10086 times
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

  Stay Connected with TAGKC

Galleries

            Dear Community Members, We hope and wish...
Executive Committee Honorary Advisors Trust Boardకార్యవర్గం గౌరవ...
  'భోగి' భోగభాగ్యాలతో సంక్రాంతి'...
 Dear Patron,   It’s that time of the year and TAGKC executive committee...

Who's Online

We have 21 guests and no members online

Get connected with Us

Subscribe to our newsletter

POPULAR TOPICS

 • ఇట్లు మీ విధేయుడు ..భమిడిపాటి రామగోపాలం
  భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు.
  Read more...
 • అల్లూరి సీతారామరాజు చరిత్ర
  భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య…
  Read more...
 • గబ్బిలము- గుర్రం జాషువా
  గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి ,…
  Read more...
 • మొల్ల రామాయణం
  “కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ…
  Read more...
 • బారిష్టర్ పార్వతీశం
  మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు…
  Read more...