వార్తాపత్రిక-సృజనాత్మక భాషా బోధన

మీరు భాషోపాధ్యాయులా ? సాంప్రదాయ పధ్ధతుల్లో భాగంగా పాఠ్యపుస్తకాన్ని  బోధనావనరుగా ఉపయోగించి  విసిగిపోయారా ? అయితే తప్పకుండా వార్తాపత్రికను మీ తరగతిగదిలో బోధనావనరుగా ఉపయోగించండి.

భాషకు సంబంధించిన పఠనావగాహన, వ్యాకరణం, పదజాలాభివృధ్ధి, సంగ్రహంగా వ్రాయడం లాంటి నైపుణ్యాలను అభివృధ్ధి చేయడానికి వార్తాపత్రికను ఉపయోగించి నిర్వహించగల కొన్ని  కృత్యాలను  రచయిత ఇక్కడ పంచుకొన్నారు.    

దీనిని తక్కువ ఖర్చుతో నిర్వహించగలిగే రెండు పధ్ధతులను ఇక్కడ వివరించారు.

1 వార్తాపత్రికలను అమ్మే స్థానిక వ్యాపారితో మాట్లాడి ప్రతి మంగళవారం, సోమవారం వార్తాపత్రికలను 40 కాపీలను తక్కువవెలకు తెచ్చుకోవాలి. (అమెరికాలో ఆన్ లైన్ లో వార్తా పత్రికలు లభ్యమవుతున్నాయి.) 

2. పిల్లలను ఆదివారం వార్తాపత్రికలను సోమవారం తీసుకొని రమ్మని చెప్పాలి . పిల్లలు జతలుజతలుగా ఈ కృత్యాన్ని నిర్వహించ వచ్చు. కానీ ప్రతిఒక్కరూ ఒక కాపీని కలిగిఉంటే మంచిది.   

మనం ఏరోజు ఈ కృత్యాన్ని నిర్వహిస్తామో పిల్లలకు ముందే తెలియచేయడం వలన వారు దీనికి సిధ్ధమై వస్తారు.

ఈ వార్తాపత్రికలతో మనమేమీచేద్దాం ?  వీటిని మనం ఎంత ప్రభావవంత ఉపయోగించవచ్చో చూద్దాం ?

ఇక్కడ కొన్ని కృత్యాలను ఆంగ్లబాషోపాధ్యాయుల కోసం ఇస్తున్నాము వీటినే ప్రాంతీయ బాషలకు కూడా ఉపయోగించ వచ్చు.  ఇంకా ఈ కృత్యాలను మీ విద్యార్థుల స్థాయి, మీ స్థానిక అవసరాల  ఆధారంగా రూపొందించుకోవచ్చు.

1. స్పెల్లింగ్ : వార్తాపత్రికలో ఎవరైతే ఎక్కువ ముద్రణా తప్పులను కనుగొంటారో వారికి బహుమతి ఇవ్వాలి. దీని వలన పిల్లలలో స్పెల్లింగ్ పట్ల అవధారణ పెరుగుతుంది.

2. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలలో  మార్పు : వార్తాపత్రికలొ వచ్చిన సంఘటనలను ఇప్పుడు జరుగుతున్నట్లు వ్రాయమని చెప్పాలి.

3. జరిగిన సంఘటనను తిరిగి మరొక పధ్ధతిలో వ్రాయమని చెప్పండి. ( ఉదాహరణకు  బస్సులో ప్రయాణికునిలా , ఒక విజేతగా, ఒక బందీగా మొదలైనవి )

4.  వార్తను తెలియచేసిన విధానం : ఒక వార్తాంశాన్ని ఒక వ్యాసంగాగానీ లేదా ఒక చిన్నకథగా వ్రాయమని చెప్పండి.

5. పదజాలాభి వృధ్ధి : వారిని వార్తాపత్రికలోని ఏదోఒక వార్తలోని 5 పదాలను గుర్తించి వాటిని గీతతో గుర్తించండి. ఈ పదాల  అర్థాలను పూర్తీగా అవగాహన చేసుకొన్నారని మీరు నిర్ధారించుకోండి. ఈ పదాలతో కొన్ని స్వంతవాక్యాలను వ్రాయమని చెప్పండి.

6. వార్తలోని ముఖ్య విషయాన్ని గ్రహించడం :

·         వీలైనన్ని వార్తలను కత్తిరించండి.

·         ఇలా కత్తిరించిన ప్రతివార్తవెనుక సంఖ్యలతో లేదా వర్ణమాలతో  ఆ వార్తయొక్క క్రమాన్ని గుర్తించండి.( వార్తయొక్క శీర్షికను వార్తను కూడా దీని కోసం ఉపయోగించాలి )

·         వార్తాపత్రికలోని శీర్షికలను కత్తిరించండి.

·         ఇలా కత్తిరించిన వార్తాపత్రికలోని శీర్షికలను, వార్తను ఒక పాత కవరులో ఉంచండి.

·         ఈ కవర్లను మార్చుకోండి.  

·         ఎవరు ముందుగా శీర్షికలను మరియు వార్తలను సరిగ్గా జతచేస్తారో చూడాలి. ఈ కృత్యాన్నే రెండు మూడు సార్లు నిర్వహించవచ్చు.

7. భాషావిభాగాలను గుర్తించడం : ఇచ్చిన వార్తాలోని సర్వనామాలను, నామవాచకాలను, విశేషణాలను, క్రియలను మొదలైయాంవాటిని గుర్తించి వ్రాయమని చెప్పవచ్చు.

8. పూర్తీగా  వాక్యాన్ని వ్రాయడం : పత్రికలోని ప్రకటనల విభాగంలోని కొన్ని పదాలను ఎన్నిక చేసి విద్యార్థులకు ఇవ్వాలి. వీటి ఆధారంగా పూర్తీ ప్రకటనను పూర్తీగా తయారు చేయమని చెప్పాలి.

9. చిత్రం : పత్రికలో ఇచ్చిన ఒక చిత్రాన్ని కత్తిరించండి. ఒక కాగితానికి దానిని అంటించి విద్యార్థులను దాని గురించి ఒకటి లేదా రెండు పేరాలను వ్రాయమని చెప్పండి.

10. సంగ్రహంగా వ్రాయండి(précis).  ఒక వార్తను ఇచ్చి దానిని 1/3 వంతుకు కుదించి సంగ్రహంగా వ్రాయమని చెప్పండి.

11. out lining skills  : ఒక ముఖ్యవార్తలోని ముఖ్యాంశాలను వ్రాయమని చెప్పండి. ఉదాహరణకు ప్రధానమంత్రి ఉపన్యాసం లేదా ఒక దేశరాజకీయాలకు సంభందించిన వార్త లేదా చాలా విపులంగా వ్రాసిన ప్రపంచ ఫూట్ బాల్ ఆటకు సంబంధించిన వార్త మొదలైనవి.

12. persuasive writing ఒకే రకమైన వస్తువువుకు సంభంధించి రెండు కంపెనీలకు చెందిన ప్రకటనలను కత్తిరించి  (ఉదాహరణకు టి వీలు లేదా శీతలీకరణ యంత్రాల గురించి )ఒక కాగితానికి అంటించండి. ప్రకటనలలో ఇచ్చిన పాయింట్ల ఆధారంగా విద్యార్థులను ఏ వస్తువును ఎన్నుకోవచ్చో  అని ఒక పేరాను వ్రాయమని చెప్పండి.

13. లేఖలను వ్రాయడం : విద్యార్థులను వ్యక్తీకతంగా కానీ లేదా తరగతి మొత్తంగా కానీ వర్తమాన అంశాల గురించి కానీ లేదా ప్రాంతీయ విషయం పై కానీ వార్తాపత్రికల సంపాదకులకు ఉత్తరాన్ని వ్రాయమని చెప్పండి. ఆ ఉత్తరం తరగతి మొత్తంకలసి వ్రాసిఉంటే దానిని పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా పంపడం సముచితంగా ఉంటుంది.

ఈ విధంగా కొంత సృజనాత్మకతతో వార్తాపత్రిక మీ భాషాతరగతికి జీవాన్ని అందించవచ్చు. 

Mary Ann Dasgupta
http://www.teachersofindia.org/te

 

 

 

Get connected with Us

Subscribe to our newsletter

POPULAR TOPICS

 • ఇట్లు మీ విధేయుడు ..భమిడిపాటి రామగోపాలం
  భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు.
  Read more...
 • అల్లూరి సీతారామరాజు చరిత్ర
  భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య…
  Read more...
 • గబ్బిలము- గుర్రం జాషువా
  గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి ,…
  Read more...
 • మొల్ల రామాయణం
  “కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ…
  Read more...
 • బారిష్టర్ పార్వతీశం
  మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు…
  Read more...